Rr News Telangana
కోరుట్లజగిత్యాల

హత్య చేసిన నిందితుడి అరెస్ట్

  • హత్యకు ఉపయోగించిన కత్తిని, ద్విచక్ర వాహనం స్వాధీనం

కోరుట్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో అర్బన్ కాలనీ, కోరుట్ల లో అనుమల్ల వెంకటరమణ s/o రాజ గణేష్, వయసు:50 సంవత్సరములు, కులం: పద్మశాలి R/o కోరుట్ల అనునతనిని వాసాల రఘు s/o రాజేష్ అనునతను చంపడం జరిగింది.ఈ విషయంలో మృతుడు అనుమల్ల వెంకటరమణ భార్య అనుమల పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీస్ లు పై అధికారుల ఆదేశాను ప్రకారం దర్యాప్తు ప్రారంభించి నిందితుడు అయినా వాసాల రఘును పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇట్టి మర్డర్కు గల కారణం మృతునికి మరియు నిందితుడుకి గతంలో పాత కక్షలు ఉండడం వలన, నిందితుడి పై మృతుడు గతంలో కేసులు పెట్టించినాడని అదేవిధంగా మృతుడు నిందితుడి యొక్క కుటుంబం గురించి మరియు నిందితుడి తల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని మృతుడిపై కక్ష పెంచుకొని మృతున్ని కత్తితో పొడిచి చంపినాడని ప్రాథమిక దర్యాప్తులో తెలిసినది. ఈరోజు నిందితుడు అయినా వాసాల రఘును అతని ఇంటి వద్ద పట్టుకొని అతని వద్దనుండి మృతుడిని చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు అట్టి సమయంలో ఉపయోగించిన టూ వీలర్ మోటార్ సైకిల్ ని స్వాధీన పరుచుకున్నారు.

Related posts

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

Rr News Telangana

ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు

Rr News Telangana

కోరుట్లలో రాజ శ్యామల సమేత చండీ హోమం

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group