Rr News Telangana
జగిత్యాలతెలంగాణ

2024-25 రాష్ట్ర బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించాలి

  • బిసి సంక్షేమ సంఘం డిమాండ్

జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని బి.సిల సంక్షేమం కొరకు 2024-25 రాష్ట్ర బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008 లో ప్రవేశపెట్టిన పూర్తి రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి 2014 లో బిఆర్ ఎస్ ప్రభుత్వం సగం ఫీజులు ఇస్తూ విద్యార్థుల గొంతు కోసిందని విమర్శించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పెద్దఎత్తున విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇవ్వాలని ఎన్ని ధర్నాలు చేసినా గత ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. మరియు బిసి లకు సబ్సిడీ రుణాలను అందించాలని మరియు బిసి కులవృత్తుల వారిని ఆదుకొని వారికి ఉపాధి రుణాలను ఇప్పించాలని మరియు బిసి రాష్ట్రాలకే వెన్నెముక లాంటి వారని …బిసి ల ఓట్లతో అధికారంలోకి వచ్చి బిసి లను విస్మరించి చిన్నచూపు చూసే పార్టీలకు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాము. బిసి కార్పోరేషన్ ల నుండి బిసి లందరికి సబ్సిడీ రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి సంక్షేమ సంఘం జగిత్యాల నియోజకవర్గం అధ్యక్షులు తిరుపురం రాంచందర్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల్ల సంజయ్ సామ్రాట్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జాజాల రమేష్, రాష్ట్ర కో ఆర్డినేటర్ ఋషికేష్ మరియు బి.సి నాయకులు తిరుపురం శ్రవణ్ కుమార్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాసరలో ధర్నా చేపట్టిన ఆలయ సిబ్బంది

Rr News Telangana

మంత్రగాళ్లను ఒక్కొక్కళ్ళను చంపబోతున్నాం

Rr News Telangana

హనుమాన్ జయంతికి కట్టుదిట్టమైన భద్రత

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group