- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
రైతులు వరి పంటసాగు పైననే దృష్టి సారించకుండా అంతర్ పంటగా అయిల్ పామ్ సాగు చేసేలారైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిం చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు .బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో అయిల్ పామ్ నర్సరీని, బోమ్మనపల్లి గ్రామంలో ఈజియస్ ద్వారా సాగు చేసిన మామిడి తోటను, ఇందుర్తి గ్రామంలోని సంపద వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులు ఎక్కువగా వరిని మాత్రమే సాగు చేస్తారని, అలాంటి వారందరికి అయిల్ పామ్ పంట సాగు వివరాలను, చేకూర్చే లబ్ది గురించి వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు. అంతర్ పంటగా అయిల్ పామ్ ను సాగు చేసేలా చూడాలని అన్నారు.అనంతరం బోమ్మనపల్లి గ్రామంలో ఈజిఎస్ ద్వారా 3 ఎకరాలలో 225 మామిడి మొక్కలతో సాగు చేస్తున్న రైతు గంప సతీష్ మామిడి తోటను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మామిడి తోటను సాగు చేస్తున్న రైతును అభినందించి, రైతు వేదికలలో నిర్వహించే రైతు సమావేశాలలో గంప సతీష్ ద్వారా మామిడి సాగు పై మాట్లాడించాలని సూచించారు. అనంతరం చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని సంపద వనాన్ని సందర్శించి వనాన్ని మరింత అభివృద్ది పరచాలని అధికారులను అదేశించారు. డిఆర్డిఓ శ్రీలత మాట్లాడుతూ మండలంలో గత 3 సంవత్సరాలలో ఈజియస్ ద్వారా 25 ఎకరాల్లో ఇచ్చిన మామిడి తోట అనుమతులు, పిటింగ్, ప్లాంటింగ్ మరియు ప్రతి మొక్కకు నిర్వహణ ఖర్చులుగా 3 సంవత్సరాల వరకు అందించే 10రూపాయల సబ్సిడి ఇవ్వడం జరుగుతుందని, ఈ ఏడాది 35 ఎకరాల్లో మామిడి, 1 ఎకరలో నిమ్మ, 56 ఎకరాల్లో అయిల్ పామ్ కొరకు అనుమతులు మంజూరు చేసి పిట్టింగ్, ప్లాంటింగ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్సి సంక్షేమ అధికారి నతానియోల్, డిఆర్డిఓ శ్రీలత, యంపిపి వినిత, అడిషనల్ డిఆర్డిఓ సంద్య, ఇతర అధికారులు పాల్గోన్నారు. సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, కరీంనగర్ చే జారీ చేయనైనది.