మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెన్నక్కి తిసుకోని ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని వేములకుర్తి గ్రామ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వేములకుర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతు బాల్క సుమన్ ఎంపి,ఎమ్మెల్యే గా చేసి రాజ్యాంగ బద్దంగా మాట్లడాల్సిన వ్యక్తి ఇష్టరాజ్యాంగ ప్రవర్తిచటం అతని అహంకారనికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనీ పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతరన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాంపెల్లి వెంకటద్రి,గుమ్మల రమేష్, బుర్రి ముత్యం, తరి రామనుజం, మాట్ల రవితేజ, బస మనిష్,బుర్రి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.