జగిత్యాల టౌన్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జిల్లా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగాచేపట్టిన బంధును విజయవంతం చేయాలని ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రం కోరారు. ఈమేరకు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రం భవన నిర్మాణ జిల్లా కార్యదర్శి రామిల్ల రాంబాబు లు కలిసి,సమ్మె నోటీసు ఇచ్చారు.ఈనెల 16న కార్మికుల సమ్మెలోఅన్ని రంగాల కార్మికులు పాల్గొనలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు కిరణ్, మహేష్,దేవదాస్,రమేష్,రాములు,అతిక్ ,ధర్మయ్య , సమీర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.