- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లాలో ఫిబ్రవరి 7 నుండి 14 వ తేదీ వరకు నిర్వచించే ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం జగిత్యాల జిల్లాలోని 383 గ్రామ పంచాయతీల్లో నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం స్పెషల్ ఆఫీసర్లను, పంచాయతీ సెక్రెటరీ లను నియమించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల సహకారం, స్వయం సహాయక యూత్ భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్యంపై ఇంటింటికి అవగాహన కల్పిస్తూ, త్రాగునీటి పైన ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించడం, గ్రామ పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా అధికారుల సహాయంతో వాటికి సత్వర పరిష్కార మార్గాలు చూపే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూములను గుర్తించి చెట్లు నాటడం జరిగిందని, ఆ చెట్లను ఏ విధంగా కాపాడుకోవాలని, ఈ సంవత్సరం నాటబోయే చెట్ల యొక్క గ్రీన్ యాక్షన్ ప్లాన్ కోసం నర్సరీని పరిశీలించి లోపం ఉన్నట్లయితే సరిద్డడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం త్రాగునీటి పైన గ్రామీణ నీటి సరఫరా అధికారులకే కాకుండా గ్రామ పంచాయతీ అధికారులకు కూడా అధికారం ఇవ్వడం జరిగిందని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉందా లేదా, అది ఎలా పనిచేస్తుంది, నాణ్యత ఉందా లేదా, క్లోరినేషన్ ఏ విధంగా జరుగుతుందని, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతీ నెల 1,11, 21 వ తేదీ శుభ్రం చేయాలని, ఈ పని జరుగుతుందా లేదా అని అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 వ తేదిన ఓవర్ హెడ్ ట్యాంకులు లీకేజీలు ఉన్నాయా, బల్క్ వాటర్ సప్లై ఏ విధంగా జరుగుతుందని, ఇంకా నల్ల కనెక్షన్లు లేని ఇల్లు ఉన్నాయా గుర్తించడం జరుగుతుందని, క్లోరినేషన్ క్రమం తప్పకుండ జరుగుతుందా లేదా వీటన్నింటి పైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు , గ్రామ సిబ్బంది, ప్రజల సహకారంతో ఈ రోజు ప్రతి గ్రామాలలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సూపర్ వైజరీ అధికారులను, మండల స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఈ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని, రానున్న సమయంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.