మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెటపల్లి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి లో గత 5,6 సంత్సరాల నుండి డెప్యూటషన్ పై విధులు నిర్వాహిస్తున్న డాక్టర్ సాజిద్ అహ్మద్, డాక్టర్ పట్నాల.అమరేశ్వర్, సుశీల్ కుమార్,తో పాటు మరో వైద్యుల డెప్యూటషన్లను రద్దు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టిన ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఆర్డర్లు పొంది మాజీ ఎం.ఎల్.ఏ. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కాన్న్సెంట్ లెటర్ ద్వారా డాక్టర్ సాజిద్ అహ్మద్,డాక్టర్ పి.అమరేశ్వర్ గత 6 సమత్సరాల నుండి డెప్యూటషన్ పై మెటపల్లి సి.హెచ్.సి లో విధులు నిర్వహిస్తున్నారు అలాగే డాక్టర్ సుశీల్ కుమార్ ధర్మపురి నుండి,మరో వైద్యుడు పెద్దపల్లి నుండి డెప్యూటషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా డెప్యూటషన్లను రద్దు చేస్తున్నట్లు జి.ఓ.జారీ చేస్తూ వీరందరూ యద స్థానాలకు ఈ నెల 8న విధులకు హాజరుకావలని ఆదేశించారు.