సిద్దిపేట, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి. సత్యనారాయణ రెడ్డి, బుదవారం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అభినందించి గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా నిఘా పెంచాలని తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జూదం ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు.