వికారాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
వికారాబాద్ జిల్లా మద్దూర్ మండలంలో జిల్లాస్థాయి డీకే అరుణ క్రికెట్ టోర్నమెంట్” ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తే భారత దేశంలో గోల్డ్ మెడల్స్ సాధించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని కోరారు. క్రీడాకారులు టోర్నమెంటులో స్నేహభావంగా మెలిగి, ఆడుకోవాలని సూచించారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు ప్రథమ బహుమతిగా 50వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 25 వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ యువ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.