- వృద్ధాశ్రమంలో బ్రెడ్ మరియు పండ్ల పంపిణీ
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుప్రీమ్ కోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరమ్ చంద్ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి. రయీజుద్దిన్ ఆధ్వర్యంలో రెగుంట గ్రామంలో గల నివేదిత వృద్ధ ఆశ్రమంలో బ్రెడ్ మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేగుంట MPTC గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కరమ్ అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేగుంట MPTC గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నిమ్మల జలంధర్ రెడ్డి, పండుగుల సంజీవ్, సామ మోహన్ రెడ్డి, నేరెళ్ళ రాజీ రెడ్డి, ముడంపల్లి శేఖర్, బొమ్మెన మహేశ్, అడ్వకేట్ సురభి అశోక్, ఎండి. ఖలిడ్, ఆసిఫ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.