- మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్
నిర్మల్ ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో ముధోల్ మండలం బోరిగాం గ్రామానికి తాజా మాజీ సర్పంచ్ ఏర్రం అమృత మురళి,వార్డు సభ్యులు,పి. ఏ. సీ.ఎస్ డైరక్టర్ అర్గుల సాయన్న తదితరులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావుపల్లి నాయత్వములో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు విమర్శల విమర్శలు చేయడం శోచనీయమని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులని అధికారం ఎవరికి శాశ్వతం కాదని సరైన ప్రజా పాలన చేయని వాళ్ళని ప్రజలు పంట పొలంలో కలుపు మొక్కలు పక్కన పెట్టినట్టు నాయకులు కూడా పక్కన పెట్టే అధికారం ప్రజలకు ఉందని మరొకసారి గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన గ్రామ నాయకత్వానికి స్వాగతం పలికి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని తెలియజేసి, కార్యకర్తలకు ఎల్లప్పుడూ సహా సహకారాలు ఉంటాయని తెలియజేసి, పార్టీ కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షిందే ఆనందరావు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెజ్జంకి ముత్యం రెడ్డి, శంకర్ చంద్రే, ఎన్. ఎస్.యు.యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజద్ షేక్,గోపిడి ప్రేమ్నాద్ రెడ్డి, శ్యామ్ రావు పటేల్ నాయకులు రామచంద్ర రెడ్డి, అటల్ దేవిదాస్, ఎం. పోశేట్టి,ఎస్.కే పాష,బి. గంగధార్, ముత్తన్న,భుమన్న తదితరులు పాల్గొన్నారు.