- జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత , సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యం అని సైబర్ సెల్ డిఎస్పీ D.V రంగ రెడ్డి అన్నారు. అందులో బాగంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ పోలీస్ ఆద్వర్యంలో సైబర్ జాగౄక్త దివస్ అనే కార్యక్రమం ద్వారా సైబర్ భద్రత తో పాటు సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి.ఈ యెక్క కార్యక్రమంలో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరని అన్నారు.