Rr News Telangana
ఆంధ్రప్రదేశ్

రైల్వే గేట్ మూతతో చెరకు రైతులకు ఇక్కట్లు మరమ్మత్తుల పేరుతో మరొకసారి వీరవల్లి రైల్వే గేటు మూసివేత

విజయవాడ విశాఖ రైల్వే మార్గంలోని 463 కిలోమీటర్లు 331 లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్న రైల్వే గేట్ ని మరొకసారి మూసివేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం చెరకు సీజన్ ముమ్మరం కావటంతో వీరవల్లి, రంగన్నగుడెం,సింగన్న గూడెం కు చెందిన వందలాది ఏకరల్లో చెరకు పంటను ఎస్ ఎన్ పాలెం దగ్గర గల లోడింగ్ పాయింట్ కు చేర్చేందుకు, ఆయిల్ ఫామ్ పంటను అంపాపురం వద్ద కల ఫ్యాక్టరీ కి తరలించేందుకు 10 కి. మీ తిరిగి వెళ్లాల్సిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపులపాడు మండలం వీరవల్లి వద్ద ఉన్న ఈ గేటుని మరమ్మత్తుల పేరుతో తరచూ మూసివేస్తున్నారు సరిగ్గా 2 నెలల క్రితం నాలుగు రోజుల పాటు మూసి వేయడంతో రైతులు స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు వెంటనే రాకపోకలు పునరుద్ధరిస్తున్నామని మరో ఆరు నెలల వరకు ఇలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు హామీ ఇచ్చారు తాజాగా ఈ రోజు ఉదయం మూసివేశారు. మరో రెండు రోజుల వరకు రాకపోకలు కుదరదు అంటూ సూచికలు ఏర్పాటు చేశారు చెరకు సీజన్ నేపథ్యంలో నిత్యం ట్రాక్టర్లు ఎడ్లబండ్లు వెళ్లే సమయంలో గేటు మూసివేయటంపై సర్వత్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు పడుతున్న ఈ ఇబ్బందిపై సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు శుక్రవారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సత్వరమే గేటు ని పునరుద్ధరించాలని కోరారు.

Related posts

సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్

Rr News Telangana

లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి

Rr News Telangana

మానవత్వం చాటుకున్న ఎర్రోళ్ల హన్మాండ్లు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group